తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా నాలుగో రోజు సహస్ర చండీయాగం - సహస్ర చండీయాగం

ఖమ్మం జిల్లాలో  పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సహస్ర చండీయాగం నాలుగో రోజు ఘనంగా నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి పూజలు

By

Published : Oct 17, 2019, 11:18 AM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తలపెట్టిన సహస్ర చండీయాగం నాలుగో రోజు వైభవంగా జరిగింది. రుత్వికులు, వేదపండితులు ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి దంపతులు తొలిపూజ నిర్వహించారు. శ్రీ రాజశ్యామలాదేవిని, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా సువర్ణ మంత్ర పుష్పాంజలితో అర్చించారు. చండీ యాగానికి త్రిదండి చిన్న జీయర్ స్వామికి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పూర్ణకుంభంతో స్వాగతించారు. మనం భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడమే యజ్ఞం అన్నారు చిన్న జీయర్ స్వామి. గాలి, నీరు, నిప్పు, భూమి, చెట్లు దైవమని పేర్కొన్నారు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యతని స్పష్టం చేశారు.

భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి పూజలు

ABOUT THE AUTHOR

...view details