తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండెనొప్పితో వైద్యశాఖ ఉద్యోగి మృతి - DIED DUE TO CARDIAC ARREST

ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పట్లాగే సైకిల్​ మీద పాలు తీసుకొని వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

అకస్మాత్తుగా గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి

By

Published : Mar 25, 2019, 12:45 PM IST

Updated : Mar 25, 2019, 1:03 PM IST

మధిర బ్రిడ్జిపై ఒక్కసారిగా కుప్పకూలిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి
ఖమ్మం జిల్లా మధిరలో సైకిల్​పై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుండె పోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో నివాసం ఉండే శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎల్.డి.సిగా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద గేదెలను పెంచుతూ స్థానికంగా పాలను విక్రయిస్తున్నాడు. రోజులాగే సోమవారం కూడా పాలను ఖాతాదారులకు అందించి సైకిల్​పై తిరిగి ఇంటికి వెళ్తుండగా మధిర బ్రిడ్జిపై ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే కిందపడిపోయాడు. వాహనదారులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేసరికే శ్రీనివాసరావు చనిపోయాడు.

ఇవీ చూడండి :పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు


Last Updated : Mar 25, 2019, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details