తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో గంజాయి ముఠా గుట్టు రట్టు - GANJA ACP PRESS_MEET in Khamamm district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్​ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నిందితులను ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ganja-acp-press-meet-in-khamamm-district
ఖమ్మంలో గంజాయి ముఠా గట్టు రట్టు

By

Published : Dec 10, 2019, 7:25 PM IST

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై శనివారం వాహనాల తనిఖీలో భాగంగా మహారాష్ట్రకు చెందిన కారులో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో 104 ప్యాకెట్లలో రూ. 24 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వాహనం నెంబర్ ప్లేట్లు రాష్ట్రం పేరును మార్చి కారులో గంజాయి స్మగ్లింగ్ చేయడం ఈ నిందితులకు వెన్నతో పెట్టిన విద్య అని తెలియజేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మంలో గంజాయి ముఠా గట్టు రట్టు

ఇదీ చూడండి: మురికి వదలనుంది: మూసీ ప్రక్షాళనకు మూడు ప్రణాళికలు!

ABOUT THE AUTHOR

...view details