కోరికలు తీర్చే గంగమ్మకు భక్తుల బోనాలు - gangamma
గంగమ్మ తల్లి జాతర ఖమ్మంలో వైభవంగా జరుగుతోంది. మహిళలు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల బోనాలు
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో గంగమ్మ తల్లి జాతర వైభవంగా సాగుతోంది. ఉదయం నుంచే మహిళలు ప్రసాదం చేసి బోనాలతో పొలిమేరలో ఉన్న ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లారు. జన్నారంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.