ఖమ్మం జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 46 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ముదిగొండ మండలం బాణాపురంలో 46.3 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత కావడం పరిస్థితిని సూచిస్తోంది. ముదిగొండ, ఖమ్మం, వైరా తదితర ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఖమ్మంలో బెంబేలెత్తిస్తున్న ఎండలు - heat
ఖమ్మం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల ధాటికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలోనే నమోదవుతున్నాయి.
బెంబేలెత్తిస్తున్న ఎండలు
ఇవీ చూడండి: అభిమాని మృతిపై ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్