అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సూర్యాపేట డివిజన్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ రాజారావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం గార్లఒడ్డు, నాచారం ఆలయాల్లో ఆయన మొక్కలు నాటారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో హరితహారం ద్వారా గడచిన నాలుగేళ్లలో వన సంపద రెట్టింపు చేశామన్నారు. వీటితోపాటు అన్యాక్రాంతమైన అటవీ భూముల్లో కూడా మొక్కలు నాటుతూ పూర్వ స్థితికి తీసుకు వస్తున్నారని తెలిపారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో దట్టమైన అడవులు ఉండేవని... ఆక్రమణలు పోడు నరకడం వల్ల చాలా వరకు అడవులు తగ్గాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ భూముల్లో మొక్కలు నాటి, రక్షణ చర్యలు చేపడుతామని రాజారావు తెలిపారు.
'నాలుగేళ్లల్లో వనసంపద రెట్టింపు'
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు... అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సూర్యాపేట డివిజన్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ రాజారావు తెలిపారు.
'నాలుగేళ్లల్లో వనసంపద రెట్టింపు'