తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సింగిరెడ్డి - Farmers

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు సాధ్యం అవుతుందన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

By

Published : Aug 6, 2019, 9:44 AM IST


రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. రైతులకు మేలు జరిగేలా సర్కారు విధానాలు ఉంటాయన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాల సాగు సాధ్యం అవుతుందన్నారు. మార్కెట్​కు వచ్చే ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కమిటీ చొరవ తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు వ్యవసాయం వైపు మళ్లేలా సాగు ఉండాలన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్​గా మద్దినేని వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా పిన్ని వెంకటేశ్వరరావు, ఇతర కమిటీ సభ్యుల చేత మార్కెట్ అధికారి సంతోశ్​ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: సింగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details