గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా వైరాలో రైతులు రోడ్డెక్కారు. వైరా తహసీల్దార్ కార్యాలయానికి సంయుక్త కలెక్టర్ అనురాగ్ జయంతి వచ్చారని తెలుసుకుని భారీగా చేరుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు జీవనాధారం అయిన భూములను ప్రభుత్వానికి అప్పగించే ప్రసక్తే లేదని జేసీకి తేల్చిచెప్పారు. సర్వే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నష్టం జరగకుండా పరిహారం ఇప్పిస్తామని నచ్చచెప్పినా శాంతించలేదు.
గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు
ఖమ్మం జిల్లా వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా అన్నదాతలు శాంతించలేదు.
గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి భూములిచ్చేది లేదు