వైరాలో అకాల వర్షాలతో అపార నష్టం - ధాన్యం
ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిచిపోయాయి. నూకాలంపాడులో భారీ గాలులకు తెగిన విద్యుత్ తీగలు తగిలి పది పశువులు మృత్యువాత పడ్డాయి.
వైరాలో అకాల వర్షాలతో అపార నష్టం
ఖమ్మం జిల్లా వైరాలో రాత్రి వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో వరి ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిచిపోయాయి. మామిడి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. నూకాలంపాడు గ్రామంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి పది పశువులు మృతిచెందాయి. వైరా మార్కెట్ యార్డులోని ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: 'పరిహారం ఇవ్వకుండా పనులెలా చేస్తారు'