గిరిజనగూడాలకు రహదారి మార్గం లేకపోవడం వల్ల ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యం పాలైతే ప్రాణసంకటంగా మారుతోంది. మంచానికి జట్టీ కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలంగాణ-ఆంధ్రసరిహద్దు అటవీ ప్రాంతంలోని తూర్పు మన్యంలో ఇ్పపటికీ మౌలిక వసతులు లేవు. కూనవరం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది.
ఆదివాసీల అవస్థలు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబసభ్యులు
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా... దాని పూర్తి స్థాయి ఫలాలు ఆదివాసీలకు మాత్రం అందడం లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు ఇంకా ప్రభుత్వ ఫలాలు అందగా వెనకబడే జీవనం కొనసాగిస్తున్నారు. తూర్పు మన్యం లో ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కరువు గానే ఉన్నాయి
ఆదివాసీల అవస్థలు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన కుటుంబసభ్యులు
పిడుగుపడి రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఉంగమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు, కుటుంబ సభ్యులు పోచవరం నుంచి ప్రధాన రహదారి వరకు సుమారు మూడు కిలోమీటర్లు దూరం మంచంపైన బాధితురాలిని మోసుకెళ్లారు. అడవిలో రాళ్లు, గుట్టలు దాటుకుని మంచానికి జట్టీ కట్టి ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో గౌరీదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఇదీ చూడండి:రోడ్డు పక్కనున్నవారిపైనుంచి దూసుకెళ్లిన లారీ... ముగ్గురు మృతి