అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించటమే తెలంగాణ జనసమితి లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, నిరుద్యోగం, విద్య, వైద్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని కోదండరామ్ తెలిపారు. వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధనకు తాము కృషి చేస్తామని తమ పార్టీ అభ్యర్థి గోపగాని శంకర్‌రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించటమే లక్ష్యం - తెజస
ఖమ్మంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.
అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించటమే లక్ష్యం