తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్లను పెంచాలి... పర్యావరణాన్ని రక్షించాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్ అన్నారు. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు.

By

Published : Jun 6, 2019, 4:00 PM IST

న్యాయమూర్తి, కలెక్టర్​

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని ఖమ్మంలో ర్యాలీ తీశారు. కోర్టు ఆవరణ నుంచి ఇల్లెందు కూడలి వరకు సాగిన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. లక్ష్మణ్​, కలెక్టర్​ ఆర్​వీ కర్ణన్​తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జడ్జీ ఎం. లక్ష్మణ్ అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని కలెక్టర్ ఆర్​వీ కర్ణన్ తెలిపారు. ర్యాలీలో అదనపు డీసీపీ మురళీధర్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

చెట్లను పెంచాలి... పర్యావరణాన్ని రక్షించాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details