ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురదరాఘవాపురంలో గ్రామస్థులు సామూహికంగా మద్యపానం నిషేధించారు. నాటుసారా, బెల్టు షాపుల ద్వారా విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఆబ్కారి శాఖ అధికారి సోమిరెడ్డి హాజరయ్యారు. గ్రామస్థులు సామూహికంగా మద్యపాన నిషేధాన్ని ప్రకటించడం అభినందనీయం అన్నారు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని ప్రాంతాల్లో నాటుసారా, బెల్ట్ షాపులను అరికట్టాలని పేర్కొన్నారు.
ఆ గ్రామంలో మద్యపానం నిషేధం - ఆ గ్రామంలో మద్యపానం నిషేధం
ఖమ్మం జిల్లా బురదరాఘవాపురంలో గ్రామస్థులు మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశానికి జిల్లా ఆబ్కారి శాఖ అధికారి హాజరై వారిని అభినందించారు
ఆ గ్రామంలో మద్యపానం నిషేధం