తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో ఈనాడు గుడ్​ హెల్త్​ షో.. ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్​ - Ramoji Foundation

Eenadu Good health show: ఈనాడు సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో టీఎన్జీవో ఫంక్షన్​ హాల్లో ఈనాడు గుడ్​ హెల్త్​ షోను జిల్లా అదనపు కలెక్టర్​ మధుసూదన్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నగరానికి చెందిన పలు ఆసుపత్రి యాజమాన్యాలు తమ స్టాల్లను ఏర్పాటు చేసి నగరంతో పాటు దూర ప్రాంతపు ప్రజలకు ఉచింతంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

Eenadu Good health show
Eenadu Good health show

By

Published : Dec 10, 2022, 2:58 PM IST

Eenadu Good health show: ఈనాడు సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో టీఎన్జీవో ఫంక్షన్​ హాల్లో ఈనాడు గుడ్​ హెల్త్ షోను ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్​ మధుసూదన్​ ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలు ఆసుపత్రి యాజమాన్యాలు ఈ కార్యక్రమంలో భాగంగా వారి స్టాల్​లను ఏర్పాటు చేసి ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా స్పందన లభిస్తోంది.

నగర ప్రజలతో పాటు దూరపు ప్రాంత ప్రజలు భారీగా హాజరై రక్త పరీక్షలు, వివిధ రకాలు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈనాడు యాజమాన్యం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్​ మధుసూదన్​ హర్షం వ్యక్తం చేశారు.

"ఈనాడు సంస్థ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం పట్టణంలో గుడ్​ హెల్త్​ షోను ప్రారంభించడం చాలా సంతోషకరం.. రెండు రోజులు సాగే ఈ కార్యక్రమాన్ని నగరంలో ఉండే ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను".- మధుసూదన్​, జిల్లా అదనపు కలెక్టర్​

ఖమ్మంలో ఈనాడు గుడ్​ హెల్త్​ షో.. ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details