తెలంగాణ

telangana

ETV Bharat / state

జీతాల కోసం ధర్నా

ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రెండు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు తక్షణమే ఇప్పించాలంటూ ఆందోళన చేశారు.

జీతాలకోసం పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

By

Published : Feb 22, 2019, 10:51 AM IST

Updated : Feb 22, 2019, 10:56 AM IST

జీతాలకోసం రోడ్డెక్కిన పారిశుద్ధ్య కార్మికులు
పారిశుద్ధ్య కార్మికులపై అధికారులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలంటూ కార్మికులు నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఖమ్మం నగరపాలక కార్యాలయం ఎదుట ఒప్పంద కార్మికులు బైఠాయించారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదంటూ నిరసన వ్యక్తంచేశారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.


తక్షణమే స్పందించాలి
సుమారు 820 మంది పారిశుధ్య కార్మికులు 2 నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు...


Last Updated : Feb 22, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details