13 లక్షల కరెన్సీతో దర్శనమిస్తున్న అమ్మవారు - currency_dhanlakshmi
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏన్కూర్లోని కోదండ రామాలయంలో అమ్మవారిని 13 లక్షల కరెన్సీతో అలంకరించారు.
13 లక్షల కరెన్సీతో దర్శనమిస్తున్న అమ్మవారు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని కరెన్సీతో అలంకరించారు. పదమూడు లక్షలతో అలంకరించి పూజలు చేశారు. ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.