తెలంగాణ

telangana

ETV Bharat / state

'తాగునీటి సమస్య పరిష్కరించండి' - madhira

పురపాలక శాఖ ఇంటి పన్నులు, తాగునీటి బిల్లులు వసూలు చేస్తుందే తప్ప ప్రజలకు సేవలు అందించడంలేదని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సీపీఎం నాయకుల సమావేశం

By

Published : Apr 22, 2019, 10:07 PM IST

ఖమ్మం జిల్లా మధిరలో తాగునీటి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం నాయకులు కట్ట గాంధీ, శీలం నరసింహారావు హెచ్చరించారు. మధిరకు పురపాలక శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ వచ్చి సమస్యలు పరిష్కరించేందుకు రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వేసవిలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సీపీఎం నాయకుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details