ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గంధసిరిలో అధికార పార్టీ నేతలు ఇసుక దందా చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన చేపట్టారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే క్రమంలో ట్రాక్టర్లు అతివేగంతో నడిపి పలు ప్రమాదాలకు కారణమవుతున్నారని తెలిపారు.
అధికారపార్టీ నేతల ఇసుకదందాను అరికట్టాలి: పోతినేని - sand illegal bussiness
ప్రభుత్వ పనుల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక దందా చేస్తున్నారని సీపీఎం నేత పోతినేని సుదర్శన్ ఆరోపించారు. గంధసిరిలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
cpm leaders protest against sand illegal transport
ఒక్క ట్రాక్టర్ ఇసుకను ఆరువేల నుంచి ఏడున్నర వేల వరకూ అమ్ముతూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పనుల పేరుతో తెరాస నాయకులు అక్రమ దందా చేస్తున్నారన్నారు. ఈ అక్రమ రవాణాను వెంటనే నిలిపివేయపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.