తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్​ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సీపీఐ ధర్నా - cpi protest in front off yenkur mro office in khammam

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ(ఎంఎల్​) నాయకులు డిమాండ్ చేశారు. కొవిడ్​ మహమ్మారి కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ... ఏన్కూర్​లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

cpi protest in front off yenkur mro office in khammam
వైరస్​ కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సీపీఐ ధర్నా

By

Published : Aug 7, 2020, 4:32 PM IST

దేశవ్యాప్తంగా ప్రజలు కొవిడ్​ బారినపడి మృత్యువాత పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్​) నాయకులు ఆరోపించారు. వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ... ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. .

స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు రుణాలు రద్దుచేసి పెండింగ్​లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని కోరారు. భారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:కరోనా భయాలున్నా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

ABOUT THE AUTHOR

...view details