ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. పెరుగుతున్న కేసులతో నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నెల 21న 296 కేసులు నమోదవగా... 22న 193 కేసులు నమోదయ్యాయి.
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు - covid tests in khammam
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. జిల్లాల్లో వందల కేసులు నమోదవుతుండగా... అవి రోజురోజుకు పెరుగుతున్నాయి. ఖమ్మంలో రెండు రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండగా... ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
corona cases increasing day bu day in khammam
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని కొవిడ్ పరీక్ష కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.