ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్లో పువ్వాడ అజయ్‌కుమార్ పర్యటన సందర్భంగా మాజీ శాసనసభ్యుడు జగన్ వెంకటరావు వర్గీయులు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కి స్వాగతం పలుకుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఆకతాయిలు కావాలనే వాటిని చింపివేశారని వెంకటరావు అభిమానులు ఆరోపిస్తున్నారు. సుజాతనగర్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆగ్రహించిన జలగం వెంకటరావు వర్గీయులు మంత్రి అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మీకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టే అవకాశం కేవలం కొందరికి మాత్రమే పరిమితమా అంటూ వారు ప్రశ్నించగా... మంత్రి ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు.
మంత్రిగారూ.. మీకోసం బ్యానర్లు పెడితే చించేస్తారా..? - మాజీ శాసనసభ్యుడు జగన్ వెంకటరావు తాజా వార్తలు
ఖమ్మం జిల్లాలోని సుజాతనగర్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు స్వాగతం పలుకుతూ మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు వర్గీయులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఆకతాయిలు వాటిని చింపివేయటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి స్వాగతం పలకడం కొందరికి మాత్రమే పరిమితమా అని ప్రశ్నించారు.
బ్యానర్ల విషయంలో వివాదం