తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజీనామాకు డిమాండ్ - కాంగ్రెస్​ ర్యాలీ

సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని హస్తం నేతలు విమర్శించారు. పార్టీ మారిన నేతలు రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు.

నిరసన ర్యాలీ

By

Published : Mar 5, 2019, 3:14 PM IST

కాంగ్రెస్​ నేతల నిరసన
పార్టీ మారే నేతలు ఎమ్మెల్యే పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్​ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్​ వరకు ప్రదర్శన జరిగింది. శాసనసభ్యులను కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ హస్తం నాయకులు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంబేడ్కర్​ విగ్రహానికి నివాళి

ఖమ్మం జడ్పీ కూడలి వద్ద అంబేడ్కర్​ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్​ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

ఇవీ చూడండి :'ప్రియుడి కోసం టవరెక్కింది'

ABOUT THE AUTHOR

...view details