వాక్సిన్తో మహమ్మారి పూర్తిగా అంతం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిరలోని సివిల్ ఆసుపత్రిలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తలు తప్పనిసరి'
ప్రజలంతా మాస్క్లు, శానిటైజర్లను వినియోగిస్తూ మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే కరోనా మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించవచ్చని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని మధిరలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మరికొంత కాలం జాగ్రత్తలు తప్పనిసరి: బట్టి విక్రమార్క
కరోనాపై చర్యలు తీసుకోవాలని తాను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలంతా మాస్క్లు, శానిటైజర్లను వినియోగిస్తూ మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రిచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్పర్సన్ లత, వైస్ ఛైర్పర్సన్ విద్యాలత ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కేసీఆర్ తన స్వార్థం కోసం రైతులను పణంగా పెట్టారు'