Bhatti Vikramarka Comments: సమసమాజ స్థాపనకు... తద్వారా నవభారత నిర్మాణానికి నాంది పలికిన భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే.. తిరిగి దేశంలో రాజరికం, భూస్వామ్య వ్యవస్థను తీసుకురావటానికి జరుగుతున్న కుట్రగా చూడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పౌరులకు రక్షణ కల్పించే హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.
ప్రతి పౌరుడికి తన ఓటు హక్కు ద్వారా తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. ఫ్యూడల్ భావజాలం ఉన్న వారికి రాజ్యాంగం నచ్చటం లేదన్నారు. భారత రాజ్యాంగం ద్వారా గెలిచిన తెరాస ప్రజాప్రతినిధులు బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, యువతను కోరారు.