భారీ వర్ష సూచనతో చేపల వేటకు అంతరాయం - wyra
ఖమ్మం జిల్లా వైరాలో భారీ వర్ష సూచనతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనుదిరిగారు.
చేపల వేటకు అంతరాయం
ఖమ్మం జిల్లా వైరా జలాశయంలో చేపల వేట ప్రారంభమైన కొద్దిసేపట్లోనే మత్స్యకారులు వెనుదిరిగారు. ఉదయాన్నే ఈదురుగాలులతో వర్షం రావడం వల్ల వేటకు ఆటంకం కలిగింది. భావర్షం సూచనలతో భయపడిన జాలర్లు ఒడ్డుకు చేరుకున్నారు. కొద్దిపాటిగా ఉన్న చేపల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎగబడ్డారు.