తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: భట్టి

ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్ యాత్ర ముగిసింది. ఈనెల 7న భద్రాచలం నుంచి యాత్రను ప్రారంభించిన ఆయన... 250 కిలోమీటర్ల మేర సైకిల్​పై తిరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు.

ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: భట్టి
ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: భట్టి

By

Published : Mar 12, 2021, 9:57 PM IST

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్ యాత్ర ముగిసింది. భద్రాచలం రామయ్య ఆలయ సన్నిధి నుంచి ఈనెల 7న సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క... 6 రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 250 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టి ఖమ్మంలో ముగించారు.

సైకిల్ యాత్ర ద్వారా ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్న భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెదేపా, సీపీఎం నేతలు భట్టి యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ప్రజల కష్టాలకు కారణమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు.

ప్రజల కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: భట్టి

ఇదీ చూడండి:జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. పీఆర్సీ ఎలా ఇస్తుంది.?: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details