భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్ల సముద్రం పంచాయతీ పరిధిలో నిర్మించిన బీటీ రోడ్డు మూడు నెలలకే కంకర తేలింది. శిలాఫలకం ఉన్న ప్రదేశంలోనే గుంతల మయంగా మారింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఇల్లందు టూ మహబూబాబాద్ ప్రధాన రహదారి చల్ల సముద్రం నుంచి నెహ్రూ నగర్ వెళ్లే మార్గంలో రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డు నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి.
మూణ్నాళ్ల ముచ్చటే... కంకర తేలిన బీటీ రోడ్డు
ప్రజాప్రతినిధులు ఎంతో ఆర్భాటంగా వేసిన శిలాఫలకం చోటే అభివృద్ధి పనుల తీరులో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల సముద్రంలో నిర్మించిన బీటీ రోడ్డు దుస్థితి అధ్వానంగా తయారైంది.
Bt Road Construction works worst in khammam district
ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే కంకర తేలి గుంతల మయంగా మారింది. రహదారుల భద్రత అధికారులను వివరణ కోరగా ఆరు కిలోమీటర్ల మేరకే మరమ్మతులకు మంజూరు జరిగిందని మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.