తెలంగాణ

telangana

ETV Bharat / state

పాము కాటుతో పదేళ్ల బాలుడి మృతి - ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లాలో పాము కాటుతో పదేళ్ల బాలుడు చనిపోయాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పాము కాటుతో పదేళ్ల బాలుడి మృతి

By

Published : Aug 6, 2019, 11:54 PM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండలో పాము కాటుకు గురై పదేళ్ల కర్ణకంటి జగదీశ్​ మృతిచెందాడు. గ్రామంలోని కర్ణకంటి గోపి, భవానీ దంపతుల కుమారుడు జగదీశ్​ సోమవారం రాత్రి తమ పూరిగుడిసెలో నేలపైనే పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో తండ్రి గోపి చేతికి చల్లగా తగలడం వల్ల దూరంగా విరిచి లైట్ వేసి చూడగా పాము కనిపించింది. వెంటనే ఆ పామును చంపేశారు. ఆ తర్వాత నిద్రిస్తున్న కుమారుడికి నోట్లో నుంచి నురగ రావడం వల్ల పాము కాటేసిందని భయపడ్డారు. వెంటనే ఊటుకూరులోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీనితో కుటుంబంలో విషాదం అలుముకుంది.

పాము కాటుతో పదేళ్ల బాలుడి మృతి

ABOUT THE AUTHOR

...view details