ఈనెల 13న ఖమ్మంజిల్లా ఏన్కూరు మండలం టీఎల్పేట సమీపంలోని సాగర్ కాలువలో ప్రమాదవశాత్తూ తల్లీకొడుకు పడిపోయారు. ప్రమాదం జరిగిన రోజున తల్లి హుస్సేన్ బీ మృతదేహం లభించింది. పదేళ్ల బాలుడు సాయిబాబు జాడ తెలియలేదు. అప్పటి నుంచి బాలుడి కోసం గాలించారు. నిన్న పాడైపోయిన స్థితిలో బాలుడి మృతదేహం లభించింది.
రెండురోజుల తర్వాత బాలుడి మృతదేహం లభ్యం - రెండురోజుల తర్వాత బాలుడి మృతదేహం లభ్యం
దుస్తులు ఉతికేందుకు కాలువ దగ్గరకు వెళ్లిన తల్లీకొడుకు ప్రమాదవశాత్తు నీటిలో పడి తల్లి మరణించి కుమారుడు గల్లంతైన ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరులో విషాదం నింపింది. ప్రమాదం జరిగిన రోజు తల్లి మృతదేహం లభించగా...బాలుడి మృతదేహం ఆదివారం దొరికింది.
బాలుడి మృతదేహం కనిపించింది