హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారి సౌజన్యంతో ఖమ్మం జిల్లా ఉన్నత పాఠశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. . జిల్లా కలెక్టర్ కర్ణన్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారి మదన్ మోహన్ పాఠశాలలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఎంపిక చేయబడిన పాఠశాలల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలు పరిచయం చేశారు. పుస్తక పఠనం వల్ల లాభాలు, విద్యార్థుల్లో పెరిగే విజ్ఞానం వంటి వాటి గురించి ఉపాధ్యాయులు వివరించారు. కొనిజర్ల మండలం తనికెళ్ళ పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు బీసీ కమిషన్ సభ్యుడు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ శంకర్ సందర్శించారు. ఏనుకూరు, వైరా, కొనిజర్ల, తల్లాడతో పాటు అన్ని మండలాల్లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
'పుస్తక ప్రదర్శన విజ్ఞానాన్ని పెంచుతుంది' - book
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సౌజన్యంతో ఖమ్మం జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తక పఠనంపై విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు.
'పుస్తక ప్రదర్శన విజ్ఞానాన్ని పెంచుతుంది'
TAGGED:
book