తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్ టైర్​లో స్కార్ప్​ ఇరుక్కొని మహిళ మృతి - ఖమ్మం జిల్లా తాజా నేర వార్తలు

ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళకు స్కార్ప్​ ఆమెపాలిట యమ పాశమైంది. స్కార్ప్​ రూపంలో వచ్చిన మృత్యువు ఆమె ప్రాణాల్ని కబళించింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడలో చోటుచేసుకుంది.

bike-accident-at-thallada-village-in-khammam-district
బైక్ టైర్​లో స్కార్ప్​ చిక్కుకొని మహిళ మృతి

By

Published : Jun 9, 2020, 1:34 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెనక కూర్చున్న మహిళ తాను ముఖానికి చుట్టుకున్న స్కార్ప్ వెనుక చక్రంలో చుట్టుకోవటం వల్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మౌలాన్ బీ అనే మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.

తల్లాడ గ్రామ సమీపంలో మహిళ ముఖానికి చుట్టుకున్న స్కార్ప్ వెనక చక్రంలో చుట్టుకుంది. దీనివల్ల ఆమె వెంటనే రోడ్డుపై పడిపోయింది. తలకు పెద్ద గాయం కావటం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతి వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details