ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో పాకిస్తాన్‌పై భారత జట్టు విజయం సాధించాలని ఖమ్మంలో యాగం నిర్వహించారు. నగరంలోని మల్లేశ్వరాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఈ క్రతువు చేపట్టారు. ఇవాళ జరుగుతున్న పాకిస్తాన్ భారత్ పోరులో మన దేశం ఘన విజయం సాధించాలని.. అదేవిధంగా ప్రపంచకప్ సాధించాలని ఆకాంక్షిస్తూ... పండితులు యాగం చేశారు. ముఖ్యంగా వరణుడు శాంతించి మ్యాచ్ జరగాలని ప్రత్యేక పూజలు చేశారు.
'భారత్ గెలవాలని ఖమ్మంలో యాగం' - ఖమ్మంలో యాగం'
దేశవ్యాప్తంగా అందరికి క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ క్రికెట్లో పాకిస్తాన్‌పై భారత్ గెలవాలని ఖమ్మంలో పండితులు యాగాలు చేశారు.
'భారత్ గెలవాలని ఖమ్మంలో యాగం'