ఉమ్మడి ఖమ్మంలో మండుతున్న సూర్యుడు - summer
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగ్గుమంటున్నాడు. అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తోడు విపరీతమైన ఉక్కపోతతో జనాలు పరేషాన్ అవుతున్నారు.
భానుడు భగభగలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వారం రోజులుగా 43 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుశ్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ వేడిమి తగ్గడంలేదు. సూర్యతాపం దృష్ట్యా జనం బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా... కొబ్బరిబోండాలు, పండ్లరసాలతో సేదతీరుతున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.