తెలంగాణ

telangana

ETV Bharat / state

‘రామయ్య’ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు - భద్రాచలం వార్తలు

భద్రాద్రి రాములవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 80 రోజులకు గానూ... కోటీ 35 లక్షల నగదు... 110 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి కానుకలను భక్తులు రాములోరికి సమర్పించుకున్నారు.

bhadrachalam temple hundi counting
bhadrachalam temple hundi counting

By

Published : Jan 29, 2021, 9:01 AM IST

ద్రాచలం రామాలయం చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ నేతృత్వంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 80 రోజుల ఆదాయం రూ.1,35,41,680 వచ్చినట్లు ఈవో ప్రకటించారు. బంగారం 110 గ్రాములు, వెండి ఒక కిలో 200 గ్రాములు సమకూరింది.

కొందరు విదేశీ భక్తులూ కానుకలు సమర్పించారు. గతేడాది నవంబరు 9న హుండీ ఆదాయాన్ని లెక్కించగా ఐదు నెలలకు సంబంధించి రూ.66.51 లక్షలు వచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details