తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులకు పట్టదు... పని జరగదు... - కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ

గోదావరి నదిపై భద్రాచలం, సారపాక మధ్య నిర్మిస్తున్న వంతెన ఇప్పటివరకు పూర్తికాలేదు. పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

భద్రాచలం సారపాక వంతెన

By

Published : Feb 13, 2019, 9:54 AM IST

భద్రాచలం-సారపాక వంతెన
గోదావరి నదిపై భద్రాచలం సారపాక మధ్య నిర్మిస్తున్న వంతెన పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. గుత్తేదారు ఇష్టారాజ్యం అధికారుల ఉదాసీనతతో నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 201 5 ఏప్రిల్ 1న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రహదారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి శంకుస్థాపన చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికే వారిధి ఉపయోగంలోకి వచ్చేది.
భద్రాచలం వద్ద గోదావరిపై కేంద్ర ప్రభుత్వం 1964లో మొదటి వంతెన నిర్మాణం పూర్తి చేసింది. కాలక్రమేనా ఛత్తీస్​గఢ్​, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు వాహన రాకపోకలు పెరిగాయి. నాలుగేళ్ల కిందట రెండో వంతెనకు సంబంధించిన ప్రతిపాదనల మేరకు ప్రాథమికంగా 90 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఓ ప్రముఖ గుత్తేదారు రూ. 65 కోట్లకు వారధి నిర్మాణం పూర్తి చేస్తామంటూ పనులు దక్కించుకున్నారు. నదిలో నీళ్లున్నాయంటూ, పనివాళ్లు రావడం లేదంటూ నిర్మాణాన్ని నెమ్మదిగా చేపడుతున్నారు. కేంద్రం పరిధిలో ఉందంటూ రాష్ట్ర అధికారులు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా వంతెన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details