తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం - Attempt for robbery at Khammam district wyra SBI Branch

ఖమ్మం జిల్లా వైరాలోని ఎస్‌బీఐ  బ్యాంకులో క్యాష్‌ను దోపిడీ చేయడాకి గుర్తుతెలియని దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్‌ దోపిడీకి యత్నించిన దొంగలను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం

By

Published : Oct 13, 2019, 12:15 PM IST

ఖమ్మం జిల్లా వైరా ఎస్‌బీఐ బ్యాంకులో కొందరు దుండగులు చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. రాత్రి బ్యాంకు షెట్టర్లు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బ్యాంకు లోపల ఏటీఎం మిషన్ అనుకొని... ప్రింటింగ్ మిషన్​ను పగలగొట్టారు. నగదు కనిపించకపోవటం వల్ల లాకర్ గదిని పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఉదయాన్నే బ్యాంకు తెరిచిన సిబ్బంది వాటిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి దొంగల ఫింగర్‌ ప్రింట్లు, ఇతర ఆధారాలను సేకరించారు.

ఎస్‌బీఐలో దోపిడీకి విఫలయత్నం

ABOUT THE AUTHOR

...view details