ఖమ్మం జిల్లాలోని బోనకల్ గ్రామంలో రోజురోజుకు పెరుగుతోన్న కొవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తోన్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి దృష్ట్యా సర్పంచ్ సైదా నాయక్.. గ్రామంలో స్వయంగా శానిటైజ్ చేశారు. సొంత ఖర్చులతో.. ట్రాక్టర్‌పై ఊరంతా తిరుగుతూ రసాయనాన్ని పిచికారీ చేశారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.
ఊరంతా తిరుగుతూ శానిటైజ్ చేసిన సర్పంచ్
కరోనా ఉద్ధృతి వేళ ఖమ్మం జిల్లాలోని బోనకల్ సర్పంచ్.. గ్రామంలో శానిటైజేషన్ చేశారు. సొంత ఖర్చులతో.. ట్రాక్టర్‌పై ఊరంతా తిరుగుతూ రసాయనాన్ని పిచికారీ చేశారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.
ఖమ్మం జిల్లా కరోనా వార్తలు
ప్రజలంతా అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సైదా నాయక్ సూచిస్తున్నారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మాస్క్, భౌతిక దూరం లాంటి ప్రభుత్వ నిబంధనలను పాటించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:srinivas goud: వృద్ధ కళాకారులకు పింఛను మొత్తం పెంచడంపై కృతజ్ఞతలు