తెలంగాణ

telangana

ETV Bharat / state

'పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా' - WAIRA ASSEMBLY CONSTITUENCY

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి విమర్శించారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు.

పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా : రేణుకాచౌదరి

By

Published : Mar 29, 2019, 7:41 PM IST

అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటే : రేణుకా చౌదరి
ఖమ్మంలో పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి తనకు పోటీగా ఉండటం విచారకరమని నామ నాగేశ్వరరావును ఉద్దేశించి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి ఎద్దేవా చేశారు. దేశంలో, రాష్ట్రంలో మోదీ, కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచింది కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్నారు. నేటి పాలకులు 60 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని, మరి ఇప్పుడున్న పరిశ్రమలు ఎవరు తెచ్చారో ప్రజలు గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా వైరా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్, తెదేపా కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. రేణుక సమక్షంలో ఇతర పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇవీ చూడండి :జీవన్​రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు: భట్టి


ABOUT THE AUTHOR

...view details