తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు - రోడ్డు ప్రమాదం

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి కాళ్లు నుజ్జయ్యాయి. ఆస్పత్రికి తరలించేందుకు 108 గంట వరకు అందుబాటులో లేదు. సకాలంలో సాయం అందక బాధితుడు తీవ్ర వేదనకు గురయ్యాడు. ఖమ్మం జిల్లాలో  ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదం

By

Published : Mar 10, 2019, 10:11 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ ఢీకొని లింగన్నపేటకు చెందిన నరసింహారావు అనే వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి.

108 రాక ఆలస్యం

బాధితున్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్​ కోసం ప్రయత్నించగా.. దగ్గర్లో వాహనాలు లేక ఆలస్యమైంది. తీవ్ర రక్త స్రావంతో గంటపాటు నరకయాతన అనుభవించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అనంతరం అంబులెన్స్​లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి :16స్థానాలతో కేంద్రంలో శక్తిగా ఎదుగుతాం

ABOUT THE AUTHOR

...view details