ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగుబండతండాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకుని కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. గంగుబండ తండాకు చెందిన వడిత్య రవి మద్యానికి బానిసై రోజూ తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు.
మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి - A father who killed his son in khammam
మద్యం మత్తులో కన్నకొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. మద్యానికి బానిసైన కొడుకును మద్యంమత్తులో ఉన్న తండ్రి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి
రోజులానే ఈరోజు కూడా మద్యం మత్తులో ఉన్న రవి, తండ్రి మల్సూర్తో గొడవ పడ్డాడు. తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి సిమెంట్ బిళ్లతో రవి తలపై గట్టిగా మోదగా అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యానికి బానిసైన రవి నుంచి భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!