ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోదుమూరులో కొండచిలువ కలకలంరేపింది. గ్రామంలోని చేపల చెరువులో ఏడడుగుల కొండచిలువ మత్స్యకారుల వలకు చిక్కింది. చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో ఈ భారీ కొండచిలువ చిక్కగా.. అటవీశాఖ అధికారుల సమాచారం ఇచ్చారు.
మత్స్యకారుల వలకు చిక్కిన భారీ కొండచిలువ
చేపల కోసం వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కిన ఘటన... ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోదుమూరులో చోటుచేసుకుంది. అటవీ సిబ్బంది ఆ కొండచిలువను స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
7 feets Python caught in fish pond at kodumuru
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది... కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. కొండచిలువ దర్శనంతో... నిరంతరం అదే మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.