అనారోగ్యం.. మానసిక వేదన ఓ యువకుని ఆత్మహత్యకు కారణమైంది. అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకున్న సంఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
ఆత్మహత్య
By
Published : Feb 26, 2019, 2:52 PM IST
ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఊరి బయటి చెట్టు కొమ్మకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న ఇతను..కొన్ని రోజుల నుంచి అనారోగ్యం కారణంగా మానసిక వేదనకు గురవుతున్నాడు. సోమవారం రాత్రి తన సొంత వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. చివరి మాటగా 'తన చావుకు ఎవరూ కారణం కాదంటూ' లేఖరాసి ఉంచాడు.