రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారిస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు ప్రజలందరికీ అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
'పార్టీని విస్తరించేందుకు కృషి చేస్తా'
గత అయిదేళ్ల కాలంలో కేంద్రం కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఇంతకాలం తమకు ప్రాతినిధ్యం లేనందువల్లే కేంద్ర పథకాలు ప్రజలకు చేరలేదని పేర్కొన్నారు.
కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చర్యలు
పార్టీని విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నెల 29న ప్రతి సంవత్సరం లాగే హిందూ ఏక్తా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. తనకు పార్టీ ఇప్పటికే రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా... మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా... ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు మంత్రి పదవి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తప్పని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : 'హాజీపూర్ బాధితులను ఆదుకోకుంటే దీక్ష చేస్తా'