తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యకు వరకట్న వేధింపులు.. భర్త ఇంటి ముందు ధర్నా

వరకట్న మహామ్మారి ఓ ఇల్లాలిని వేధింపులకు గురిచేసింది. విడాకుల నోటీసు అందుకునేదాక పరిస్థితి వెళ్లింది. వివాహ సమయంలో 18 లక్షలు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చినా.. అదనంగా ఇంకా తేవాలని భర్త ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనితో భర్త ఇంటి ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది.

భార్యకు వరకట్న వేధింపులు.. భర్త ఇంటి ముందు ధర్నా

By

Published : Oct 22, 2019, 12:39 AM IST

కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన ఊకంటి సంధ్య నుస్తులాపూర్​కు చెందిన శ్రీనివాస్ రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది పాటు అన్యోన్యంగా సాగిన వారి జీవితంలో వరకట్నం ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. వివాహ సమయంలో 18 లక్షలు, 20 తులాల బంగారం లాంఛనంగా కట్నకానుకలు అందజేశారు. అయితే ఇప్పుడు అదనంగా కట్నం తీసుకురావాలని భర్త వేధింపులకు గురి చేశాడని.. చివరకు విడాకుల నోటీసు పంపించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది. సంధ్యకు న్యాయం జరిగేంత వరకు తమ సహకారం ఉంటుందని మహిళా సంఘాల సభ్యులు హామీ ఇచ్చారు.

భార్యకు వరకట్న వేధింపులు.. భర్త ఇంటి ముందు ధర్నా

ABOUT THE AUTHOR

...view details