తెలంగాణ

telangana

ETV Bharat / state

తీగల వంతెనను దసరాలోగా పూర్తి చేస్తాం : మంత్రి గంగుల - cable bridge Latest News

కరీంనగర్ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు దసరాలోగా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

తీగల వంతెనను దసరాలోగా పూర్తి చేస్తాం : మంత్రి గంగుల
తీగల వంతెనను దసరాలోగా పూర్తి చేస్తాం : మంత్రి గంగుల

By

Published : Jul 16, 2020, 1:44 PM IST

కరీంనగర్‌ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిర్మిస్తున్న తీగల వంతెన భూసేకరణ సమస్యను అధిగమించి దసరాలోగా పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వివిధ దేశాల నుంచి తెప్పించిన సామగ్రితో దాదాపు పనులు పూర్తి కావస్తున్నాయి. అప్రోచ్‌ రోడ్ల భూసేకరణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి.

భూసేకరణలో మంత్రి భూమి..

స్వయంగా మంత్రి గంగుల కమలాకర్‌ తన ఎకరం భూమిని కోల్పోతున్నారు. తాను కోల్పోతున్న భూమిని పరిశీలించిన మంత్రి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి దాదాపు 173 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా.. ఇతర అవసరాలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చు అవుతున్నాయంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.

తీగల వంతెనను దసరాలోగా పూర్తి చేస్తాం : మంత్రి గంగుల

ఇవీ చూడండి : ఉస్మానియా శిథిలావస్థకు చేరింది.. చర్యలు చేపట్టండి: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details