దేశవ్యాప్తంగా ఒకరకమైన జాతీయవాదం భావన నడుస్తోందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికలకు ముందు తీవ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులు భాజపాకు అనుకూలంగా మారాయని స్పష్టం చేశారు. కొత్తగా ఓటుహక్కు పొందిన యువకులు కూడా భాజపా వైపు ఆకర్షితులు అయ్యారని విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే అంతిమం అన్నారు. ప్రజల్లోనే ఉండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వినోద్ వెల్లడించారు.
నా ఓటమికి ఆయనే కారణం: వినోద్ - vindo kumar
మోదీని మళ్లీ ప్రధాని చేయాలని భాజపా చేసిన ప్రచారం ప్రజల్ని ఆకర్షించిందని మాజీ ఎంపీ వినోద్ అన్నారు. ప్రధాని ప్రభంజనంతో తాను ఓడిపోయినట్లు స్పష్టం చేశారు.
vinod