తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​, భాజపా తెలంగాణకు చేసిందేమీలేదు: ఈటల - trs

కాంగ్రెస్​, భాజపా తెలంగాణకు చేసిందేమీ లేదని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో తెరాస అభ్యర్థి వినోద్​ తరఫున ప్రచారం నిర్వహించారు.

ఈటల, వినోద్​

By

Published : Apr 7, 2019, 10:09 PM IST

కాంగ్రెస్​, భాజపా వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో లోక్​సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాస 16 మంది ఎంపీలను గెలుచుకొని కేంద్రంలో కీలకం కాబోతుందన్నారు. 2012లో కేంద్ర మంత్రి మునియప్ప లెదర్ పార్కు స్థల కేటాయింపుపై లేఖ రాయగా పొన్నం స్పందించలేదని కరీంనగర్​ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్​ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు. ఇవీ చూడండి: సింగరేణి కార్మికుల సమస్యలు తీర్చాం...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details