కరీంనగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఎదుర్కోలు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనంపై శ్రీవారిని, గజ వాహనాలపై అమ్మవార్లను విశేష అలంకరణలు చేసి శోభయాత్రగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు.
కరీంనగర్లో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - కరీంనగర్లో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఎదుర్కోలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్లో ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
యజ్ఞ వరాహ స్వామి క్షేత్రం నుంచి సారె తీసుకొచ్చి సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం ఆవరణలో భాషా సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసిన హైదరాబాద్కు చెందిన ఫ్యూజియన్ నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
TAGGED:
devotional