కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. కేడీసీఎంఎస్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు చెప్పులను వరుసలో ఉంచారు. తమకు సరిపడినన్ని బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సరఫరా చేసిన యూరియా సరిపోవట్లేదని.. మరికొంత యూరియాను ప్రభుత్వం అందించాలని రైతులు కోరుతున్నారు.
యూరియా కోసం తప్పని ఎదురుచూపులు - urea problems
యూరియా కోసం కరీంనగర్ రైతుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. తమకు కావాల్సిన యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలని కోరుతున్నారు.
యూరియా కోసం తప్పని ఎదురుచూపులు