కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ శివారులో గల కాకతీయ కాలువలో సరదాగా స్నానానికి వెళ్లి రిజ్వానుద్దీన్(16), అబ్దుల్ కరీం (27) గల్లంతయ్యారు. మృతులు ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ కుమారుడు రిజ్వాన్, బావమరిది కరీంలుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఎల్ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది తో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
కాకతీయ కాలువలో ఇద్దరు వ్యక్తుల గల్లంతు
కాకతీయ కాలువలో ఇద్దరు వ్యక్తులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్లో చోటుచేసుకుంది.
కాకతీయ కాలువలో ఇద్దరు వ్యక్తుల గల్లంతు